బఫెట్‌ను మించిన ముకేశ్‌ అంబానీ

ABN , First Publish Date - 2020-07-11T06:41:45+05:30 IST

కరోనా కష్టకాలంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధి నేత ముకేశ్‌ అంబానీ సంపద అమాం తం పెరిగిపోతోంది. ప్రస్తుతం 7,010 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.25 లక్షల కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్ల జాబితాలో

బఫెట్‌ను మించిన ముకేశ్‌ అంబానీ

  • ప్రపంచ కుబేరుల్లో ఏడో స్థానం


న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధి నేత ముకేశ్‌ అంబానీ సంపద అమాం తం పెరిగిపోతోంది. ప్రస్తుతం 7,010 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.25 లక్షల కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్ల జాబితాలో ఇన్వెస్ట్‌మెంట్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ను పక్కకు నెట్టి ముకేశ్‌ ఏడో స్థానానికి చేరారు.


బ్లూంబర్గ్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ జాబితా ప్రకారం చూసినా ముకేశ్‌ అంబానీ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. శుక్రవారం నాటికి ఆయన సంపద 6,830 కోట్ల డాలర్లతో (సుమారు రూ.5.13 లక్షల కోట్లు) వారెన్‌ బఫెట్‌ను మించి పోయింది. ఆసియా దేశాల వరకు చూసినా, ముకేశ్‌ అంబానీనే అత్యంత సంపన్నుడు. ప్రపంచంలోని టాప్‌-10 సంపన్నుల జాబితా చూస్తే అందులో ఆసియా నుంచి ఒక్క అంబానీకి మాత్రమే చోటు దక్కింది. 

Updated Date - 2020-07-11T06:41:45+05:30 IST