Abn logo
May 22 2020 @ 01:34AM

అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా ఫుడ్‌ డెలివరీ సేవల్లోకి ప్రవేశిస్తోంది. బెంగుళూరులోని నాలుగు పిన్‌కోడ్‌ ప్రాంతాల్లో కంపెనీ ఈ సేవలు ప్రారంభించనుంది. తర్వాత క్రమంగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. అమెజాన్‌ ఫుడ్‌ పేరుతో ఈ ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రారంబిస్తున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ కష్టాల నుంచి బయట పడేందుకు ఈ రెండు కంపెనీలు ఇప్పటికే 1,600 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. 

Advertisement
Advertisement
Advertisement