Abn logo
Sep 23 2020 @ 13:02PM

అమరావతి ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్తాపంతో అనేక మంది రాజధాని గ్రామాల రైతులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఉదయం అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయంతో అమరావతి తరలిపోతుందని ఆందోళన చెందిన తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు గొరిజాల వెంకటేశ్వరరావు(83) మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి ఆయన రెండు ఎకరాల 85 సెంట్ల భూమిని పూలింగ్‌కు ఇచ్చారు. రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆలోచిస్తూ తీవ్ర ఆందోళనకు గురై వెంకటేశ్వరరావు మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement