అమరావతి అంశంలో రిట్ పిటిషన్స్‌పై హైకోర్టులో వాదనలు

ABN , First Publish Date - 2020-10-07T18:55:41+05:30 IST

రాజధాని అంశంలో అనుబంధ పిటిషన్స్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలు అయిన రిట్ పిటిషన్‌లో రాయలసీమ,

అమరావతి అంశంలో రిట్ పిటిషన్స్‌పై హైకోర్టులో వాదనలు

అమరావతి: రాజధాని అంశంలో అనుబంధ పిటిషన్స్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలు అయిన రిట్ పిటిషన్‌లో రాయలసీమ, ఉత్తరాంధ్ర పిటిషన్ లపై వాదనలు జరిగాయి. ఈ ప్రాంతాలకు సంబంధించి వాదనలు రిట్‌లో వినాలని తమను కుడా రిట్ పిటిషన్‌లో పార్టీలుగా చేర్చాలని అభ్యర్థించారు. స్టేటస్ కో పరిధిలో లేని అనుబంధ పిటిషన్‌లు ప్రత్యేకంగా వినాలని గతంలోనే ధర్మాసనం నిర్ణయించింది. వాటిపై శుక్రవారం, సోమవారం వాదనలు వినే అవకాశం ఉంది. రిట్ పిటిషన్స్ అంశాల వారీగా వర్గీకరించి ధర్మాసనం విచారించనుంది. పిటిషన్స్‌ను ఏజీ, పిటిషనర్ తరపు నలుగురు న్యాయవాదులు కలిసి అంశాల వారీగా విభజించాలని హైకోర్టు సూచించింది. సోమవారం నుంచి రిట్ పిటిషన్‌లపై వాదనలు ప్రారంభించే అవకాశం ఉంది. హైబ్రిడ్ విధానం ద్వారా రిట్ పిటిషన్‌ల విచారణ ప్రారంభించే అవకాశంపై న్యాయమూర్తులు చర్చించారు. 

Updated Date - 2020-10-07T18:55:41+05:30 IST