నమ్మకస్తులెవరో నయవంచకులెవరో ఏపీ ప్రజలకు తెలియదా?

ABN , First Publish Date - 2022-07-17T02:34:08+05:30 IST

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రసారాలు, కథనాలు ప్రచురిస్తున్న చానళ్లు, ప్రతికలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ...

నమ్మకస్తులెవరో నయవంచకులెవరో ఏపీ ప్రజలకు తెలియదా?

అమరావతి (Amaravathi): ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రసారాలు, కథనాలు ప్రచురిస్తున్న చానళ్లు, ప్రతికలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులకు పత్రికలు, చానళ్లను ఆపాదిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పదే పదే సభల్లో ప్రసంగిస్తున్నారు. అయితే కొన్ని చానళ్లను ఏపీలో బ్యాన్ చేశారు.. వాటిని ప్రజలు బ్యాన్ చేశారని ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలు బ్యాన్ చేస్తే.. ఆ చానళ్లు, ఆ పత్రికలు అని పదే పదే తలుచుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ బాబాయి.. వివేకానందా రెడ్డి హత్యపై చానళ్ల ప్రసారాలు, పత్రికల కథనాలు నిజం కాదా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  మరి కేసులు, విచారణలు.. అరెస్ట్‌లు ఇవన్నీ అబద్ధమా?... అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 


 ఈ నేపథ్యంలో ‘‘ ప్రజలు మీడియాను బ్యాన్ చేశాక కూడా ఇంకా భయమెందుకు?. ప్రజలకు ఇస్తున్న డబ్బులు ఏమవుతున్నాయో నాకు తెలియదంటే అర్థమేంటో?. గత ప్రభుత్వ పథకాలు ఏమయ్యాయో శ్వేతపత్రం ఇవ్వగలరా?. నమ్మకస్తులెవరో నయవంచకులెవరో ప్రజలకు తెలియదా?.  నాటి  బాబాయి బిడ్డను.. తల్లిని, చెల్లిని చూస్తే జనానికి  అర్థంకాదా?. నన్నే నమ్మండి అని అడ్డుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-07-17T02:34:08+05:30 IST