హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆటోమోటివ్ బ్యాటరీస్ కంపెనీ అమరాన్ తమ మస్కట్ ‘ద రాన్’ను విడుదల చేసింది. కొత్త అమరాన్ బ్యాటరీలను ప్రవేశపెట్టిన సందర్భం గా ఈ మస్కట్ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ పవర్‌ను బట్టి వివిధ రాన్లు ఉంటాయి. బ్రాండ్ మస్కట్‌ను విడుద ల చేయాలని భావించామని, అందుకు తగిన సమయం కోసం ఎదురు చూశామని అమరరాజా బ్యాటరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా అన్నారు.