అన్ని గురుకులాలూ ఓపెన్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-10-06T06:15:11+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఏర్పాయి చేసిన అన్ని రకాల గురుకులాలను ఓపెన్‌ చేయాలని కులనిర్మూలన వేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తుంది...

అన్ని గురుకులాలూ ఓపెన్‌ చేయాలి

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఏర్పాయి చేసిన అన్ని రకాల గురుకులాలను ఓపెన్‌ చేయాలని కులనిర్మూలన వేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు విద్య ప్రాధాన్యత గత ఒకటిన్నర దశాబ్ద కాలం నుండి తెలిసింది. విద్య విలువ తెలిసిన బడుగులకు పాలకుల ధనిక వర్గాల ధన దాహం వలన విద్యాప్రైవేటీకరణ జరిగిపోయింది.


ఆ ప్రైవేటీకరణలోనైనా కుట్రపూరితంగా నాణ్యమైన విద్యను అందించడంలో నిర్లక్ష్యం వహించారు. ఇలాంటి క్రమంలో కరోనా వ్యాధి ప్రపంచ ప్రజలను విధ్వంసం చేసింది. ఇండియాలాంటి దేశంలో బడుగులు ఈ కరోనా కాలంలోనూ చదువుకుందామంటే ఆన్‌లైన్‌, డిజిటల్‌ చదువులకు నోచుకోలేని స్థితి ఉంది. మొబైల్‌ లేని కారణంగా బడుగులు చదువులకు దూరం అవుతున్నారు. 81 శాతం బడుగువిద్యార్థులకు చదువు అందడం లేదు. పాఠశాల, కళాశాలల, విశ్వవిద్యాలయాల స్థాయి విద్యవరకు మాత్రమే ఓపెన్‌ చేసి గురుకుల స్థాయి విద్యాసంస్థలను ఒపెన్‌ చేయరాదని రాష్ట్ర న్యాయస్థానం ఆదేశించడం బడుగులకు విద్యను దూరం చేయడమే అవుతుంది. అన్నిరకాల విద్యాసంస్థలు తెరవడంతో అక్కడ రాని కరోనా ఈ గురుకుల విద్యాసంస్థలల్లో ఎలా వస్తుంది? ప్రతి విద్యార్థికి కరోనా టీకా వేయించి తగు జాగ్రత్తలతో అన్ని గురుకుల పాఠశాలలను పునఃప్రారంభించాలి.

పాపని నాగరాజు

రాష్ట్ర అధ్యక్షులు, కుల నిర్మూలన వేదిక (కెఎన్‌వి)

Updated Date - 2021-10-06T06:15:11+05:30 IST