అక్రూత్‌ కీ గలౌటీ

ABN , First Publish Date - 2022-04-16T22:04:01+05:30 IST

వాల్‌నట్స్‌ - 150గ్రా, పనీర్‌ - 100గ్రా, బంగాళదుంపలు - 200గ్రా, వేయించిన శనగపప్పు పొడి - 15గ్రా, ఎండుద్రాక్ష - 25గ్రా, చీజ్‌ - 25గ్రా, ఉప్పు - రుచికి తగినంత, యెల్లో

అక్రూత్‌ కీ గలౌటీ

కావలసినవి: వాల్‌నట్స్‌ - 150గ్రా, పనీర్‌ - 100గ్రా, బంగాళదుంపలు - 200గ్రా, వేయించిన శనగపప్పు పొడి - 15గ్రా, ఎండుద్రాక్ష - 25గ్రా, చీజ్‌ - 25గ్రా, ఉప్పు - రుచికి తగినంత, యెల్లో చిల్లీ పౌడర్‌ - 10గ్రా, యాలకుల పొడి - 5గ్రా, కొత్తిమీర - 10గ్రా, గరంమసాల - 5గ్రా, నెయ్యి - 25గ్రా.


తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలు ఉడికించుకోవాలి. వాల్‌నట్స్‌ పొట్టు తీసి దంచుకోవాలి.ఒక బౌల్‌లో పనీర్‌ తురుము తీసుకుని అందులో బంగాళదుంపల గుజ్జు వేసి పేస్టులా కలుపుకోవాలి. తరువాత వాల్‌నట్స్‌, తగినంత ఉప్పు, యాలకుల పొడి, గరంమసాల వేసి కలుపుకోవాలి. ఒకవేళ బాగా మెత్తగా ఉంటే శనగపప్పు పొడి కలుపుకోవాలి. యెల్లో చిల్లీ పౌడర్‌ వేసుకోవాలి.తరువాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా తయారుచేసుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో ఎండ్రు ద్రాక్ష, చీజ్‌ తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత ఒక్కో బాల్‌ను తీసుకుంటూ మధ్యలో చీజ్‌ స్టఫ్‌ పెట్టి వడల్లా ఒత్తుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకుంటే ఇవి రుచిగా ఉంటాయి.

Updated Date - 2022-04-16T22:04:01+05:30 IST