Akasa Air: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం

ABN , First Publish Date - 2022-08-07T02:13:43+05:30 IST

ఇటీవలే ప్రయాణ అనుమతులు పొందిన ఆకాశ ఎయిర్‌ (Akasa Air) తొలి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఆగస్టు

Akasa Air: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం

ముంబై: ఇటీవలే ప్రయాణ అనుమతులు పొందిన ఆకాశ ఎయిర్‌ (Akasa Air) తొలి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 7న (ఆదివారం) ఆకాశ ఎయిర్‌లైన్స్ తొలి విమానం ముంబై (Mumbai) నుంచి అహ్మదాబాద్ (Ahmedabad) బయలుదేరనుంది. ఉదయం 10.05 నిమిషాలకు ముంబైలో టేకాఫ్ అవుతుంది. ఈ రెండు నగరాల మధ్య వారానికి 26 సర్వీసులు నడపనున్నట్టు ఆకాశ తెలిపింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 1.20 గంటలు. ముంబై నుంచి అహ్మదాబాద్ టికెట్ ధర రూ. 3,948 కాగా, అహ్మదాబాద్ నుంచి ముంబై టికెట్ ధరను మాత్రం రూ. 3,906గా నిర్ణయించారు. 

Updated Date - 2022-08-07T02:13:43+05:30 IST