ఎయిరిండియా... ఈ వారాంతంలో ‘టాటా’కు..!

ABN , First Publish Date - 2022-01-24T22:43:21+05:30 IST

భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... ఈ వారాంతంలో టాటాల చేతుల్లోకి వెళ్ళే అవకాశాలున్నాయి. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు సూచనప్రాయంగా వివరాలను పేర్కొన్నారు.

ఎయిరిండియా... ఈ వారాంతంలో ‘టాటా’కు..!

న్యూఢిల్లీ : భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... ఈ వారాంతంలో టాటాల చేతుల్లోకి వెళ్ళే అవకాశాలున్నాయి. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు సూచనప్రాయంగా వివరాలను పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియ నేపధ్యంలో... కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు 8 న ఎయిరిండియాను... టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీకి చెందిన టాలేస్ పన్రూవేట్ లిమిటెడ్‌కు... రూ. 8 వేల కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. కాగా... ఈ డీల్‌కు సంబంధించిన మరికొన్ని అంకాలు... త్వరలోనే పూర్తికానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా... టాటా గ్రూపునకు... ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆర్మ్ ఎయిరిండియా స్లాట్లలో కూడా 50 శాతం వాటాను అప్పగించనున్నారు. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సార్ధ్యంలోని కన్సార్షియం రూ. 15,100 కోట్ల ఆఫర్‌ను... టాటా గ్రూపు అక్టోబరు 8 న అధిగమించింది. కాగా... 2003-04 తర్ావత... ఇది తొలి ప్రైవేటీకరణ ప్రక్రియ కాగా, టటా స్టేబుల్‌లో మూడవ ఎయిర్‌లైన్ బ్రాండ్ కానుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌గా ఉన్న ఎయిర్ ఏషియా ఇండియా, విస్టాల్లో టాటా గ్రూపు మెజారిటీ వాటాలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-24T22:43:21+05:30 IST