ఎయిరిండియా చైర్మన్‌గా చంద్ర

ABN , First Publish Date - 2022-03-15T06:30:12+05:30 IST

టాటా గ్రూప్‌ సారథి నటరాజన్‌ చంద్రశేఖరన్‌ (చంద్ర) ఎయిరిండియా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎయిరిండియా బోర్డు సోమవారం....

ఎయిరిండియా చైర్మన్‌గా చంద్ర

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ సారథి నటరాజన్‌ చంద్రశేఖరన్‌ (చంద్ర) ఎయిరిండియా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎయిరిండియా బోర్డు సోమవారం సమావేశమై చంద్ర నియామకాన్ని ఆమోదించింది.  దాదాపు ఏడు దశాబ్దాల పాటు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియా మళ్లీ ఈ మధ్యనే టాటాల చేతుల్లోకి వెళ్లింది.


ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా జరిగిన బిడ్డింగ్‌లో టాటా సన్స్‌ అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌ను అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది. ఎయిరిండియా పునరుద్ధరణపై చంద్ర ప్రత్యేక దృష్టిసారించారని, గత వారం రోజులుగా ఆయనకు బోర్డు సభ్యులు సమగ్ర ప్రజెంటేషన్లు సమర్పిస్తున్నారని అధికారి ఒకరు తెలిపారు.   

Updated Date - 2022-03-15T06:30:12+05:30 IST