Agnipath Scheme: చర్చలకు వెళ్లేందుకు ఆందోళనకారుల నిరాకరణ

ABN , First Publish Date - 2022-06-17T23:29:03+05:30 IST

చర్చలకు వెళ్లేందుకు ఆందోళనకారుల నిరాకరించారు. అధికారులే రైల్వేస్టేషన్‌కు రావాలని డిమాండ్ చేశారు.

Agnipath Scheme: చర్చలకు వెళ్లేందుకు ఆందోళనకారుల నిరాకరణ

సికింద్రాబాద్‌: చర్చలకు వెళ్లేందుకు ఆందోళనకారుల నిరాకరించారు. అధికారులే రైల్వేస్టేషన్‌కు రావాలని డిమాండ్ చేశారు. తిరుమలగిరి ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారితో రాత్రి 10 గంటలకు చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ఆందోళనకారులు ససేమిరా అంటున్నారు. పోలీసులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్మీ అధికారులు వచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు. ఆర్మీ అధికారులు వస్తే డిమాండ్లు ముందు పెట్టడానికి సిద్ధమని వెల్లడించారు. అంతకుముందు అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఆందోళనకారులను చర్చలు రావాలని ఆహ్వానించారు. వెంటనే ఆందోళన విరమించాలని పోలీసులు కోరారు. డిమాండ్లు పరిష్కరించేవరకు తగ్గేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. లాఠీఛార్జ్‌, కాల్పులపై సమాధానం చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారుల తరపున 10 మంది ప్రతినిధులు రావాలని పోలీసులు కోరారు. 10 మందికి కాదు.. అందరికీ సమాధానం చెప్పాలని  ఆందోళనకారులు భీష్మించుకుకూర్చునున్నారు. నిరసన కొనసాగిస్తే తీవ్రపరిణామాలని పోలీసుల హెచ్చరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-17T23:29:03+05:30 IST