బొలీవియా దేశ అధ్యక్షురాలికి కరోనా పాజిటివ్..!

ABN , First Publish Date - 2020-07-10T21:14:20+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. మహమ్మారి బారినపడుతున్న దేశ అధ్యక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో‌కు క

బొలీవియా దేశ అధ్యక్షురాలికి కరోనా పాజిటివ్..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. మహమ్మారి బారినపడుతున్న దేశ అధ్యక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో‌కు కరోనా వైరస్ సోకిన కొద్ది రోజులకే.. మరో దేశ అధ్యక్షురాలు మహమ్మారి బారిన పడ్డారు. లాటిన్ అమెరికాలోని బొలీవియా దేశ తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ అనేజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆమె వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్న ఆమె.. ఐసోలేషన్‌లో ఉండి, పని చేస్తున్నట్లు తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి.. అనంతరం మరోమారు కరోనా పరీక్ష చేయించుకోనున్నట్లు వెల్లడించారు. తన మంత్రివర్గంలోని నలుగురు సభ్యులకు కరోనా సోకడంతో.. తాను కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. 1.1 కోట్ల మంది జనాభా ఉన్న బొలీవియాలో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. బొలీవియాలో ఇప్పటి వరకు 43వేల మంది కరోనా బారిన పడగా.. సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-10T21:14:20+05:30 IST