Advertisement
Advertisement
Abn logo
Advertisement

నమీబియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘన్ ఆటగాడు అస్ఘర్ అఫ్ఘాన్ సంచలన నిర్ణయం

అబుదాబి: నమీబియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు అస్ఘర్ అఫ్ఘాన్ సంచలన ప్రకటన చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్టు చెప్పాడు.  33 ఏళ్ల అస్ఘర్ ఆరు టెస్టులు, 114 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 75 టీ20లు ఆడాడు. అన్నింటిలోనూ కలిపి 4215 పరుగులు చేశాడు. 115 మ్యాచుల్లో జట్టును ముందుండి నడిపించాడు.


2018లో తొలిసారి భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో తలపడిన జట్టుకు ఆఫ్ఘన్ కెప్టెన్‌గా ఉన్నాడు. 59 వన్డేలకు కెప్టెన్సీ వహించిన అఫ్ఘాన్ 34 విజయాలు సాధించాడు. 21 మ్యాచుల్లో జట్టు ఓటమి చవిచూసింది. టీ20 కెప్టెన్‌గా 52 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 42 మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించాడు. 2009లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2010లో ఐర్లండ్‌తో మ్యాచ్‌లో టీ20ల్లో అడుగుపెట్టాడు. 


టీ20ల్లో అస్ఘర్‌కు ఘనమైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా 42 మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించిన అస్ఘర్.. 41 విజయాలు అందించిన ధోనీని వెనక్కి నెట్టేశాడు. టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్(46)లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గానూ అస్ఘర్ రికార్డులకెక్కాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement