Advertisement
Advertisement
Abn logo
Advertisement
May 26 2021 @ 04:25AM

బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్టుకు ఏరియల్‌ సర్వే

గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా పాయింట్లు గుర్తింపు

తాండూరు, మే 25: ముంబై-హైదరాబాద్‌ మధ్య 711 కిలోమీటర్ల మేర బుల్లెట్‌ ట్రెయిన్‌ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. నేషనల్‌ హై స్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ దేశవ్యాప్తంగా 6 కారిడార్లలో హై స్పీడ్‌ ట్రాక్‌లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు కోసం నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదన మేరకు ఏరియల్‌ సర్వేను నిర్వహించింది. ప్రాథమిక సర్వేలే భాగంగా గూగుల్‌ మ్యాపింగ్‌ ద్వారా పాయింట్లను గుర్తించారు. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లా పెద్దెముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామంలోని పెద్ద చెరువు వద్ద గూగుల్‌ మ్యాప్‌ పాయింట్‌గా గుర్తించి 3 మీటర్ల దిమ్మెను నిర్మించారు. జీపీఎస్‌ ఆధారంగా ఏరియల్‌ సర్వే జరుపుతున్నారు. హై స్పీడ్‌ రైలు కారిడర్‌ నిర్మాణం పూర్తయి బుల్లెట్‌ రైలు పట్టాలెక్కేందుకు కనీసం నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement