- అదనంగా డబ్ల్యూటీఏ ఈవెంట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం వచ్చిన ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండడంతో వారికి తగినంత ప్రాక్టీస్ లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెగా టోర్నీ ముందు ప్లేయర్లకు ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు అదనంగా ఒక డబ్ల్యూటీఏ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది. 72 మంది ఆటగాళ్లను తీసుకువచ్చిన విమానాల్లో కరోనా కేసులు బయటపడడంతో వారందరినీ కఠిన క్వారంటైన్ చేశారు. వీరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మాజీ చాంపియన్లు విక్టోరియా అజరెంకా, కెర్బర్తోపాటు 2019 యూఎస్ ఓపెన్ విన్నర్ బియాంక ఆండ్రెస్కూ, మాజీ ఫైనలిస్టు వీనస్ విలియమ్స్ ఉన్నారు. వచ్చేనెల 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరగనుంది.