హోల్సిమ్ కొనుగోలుకు... అదానీ చర్చలు

ABN , First Publish Date - 2022-04-26T19:46:37+05:30 IST

భారత్‌లోని హోల్సిమ్ లిమిటెడ్ సంబంధిత వ్యాపారాలను కొనుగోలు చేసేందుకుగాను... ప్రముఖ వ్యాపారవేత్త అదానీ బృందం చర్చలు జరుపుతోంది.

హోల్సిమ్ కొనుగోలుకు... అదానీ చర్చలు

ముంబై : భారత్‌లోని హోల్సిమ్ లిమిటెడ్ సంబంధిత వ్యాపారాలను కొనుగోలు చేసేందుకుగాను... ప్రముఖ వ్యాపారవేత్త అదానీ బృందం చర్చలు జరుపుతోంది. అదానీ గ్రూప్ రాబోయే రోజుల్లో హోల్సిమ్ నుండి అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌లో నియంత్రిత వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు వినవస్తోంది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సహా ఇతర బిడ్డర్లు ఆస్తుల కొనుగోలుపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు వినవస్తోంది.


అంబుజా షేర్లు ఏప్రిల్‌లో దాదాపు 26 శాతం పెరిగిన విషయం తెలిసిందే, దీని మార్కెట్ విలువ సుమారు $10 బిలియన్లు. కంపెనీలో 63.1 శాతాన్ని నియంత్రిస్తున్న హోల్సిమ్... తన వాటా విక్రయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంబుజా సంబంధిత అనుబంధ సంస్థల్లో... ఏసీసీ లిమిటెడ్ కూడా ఉంది. కాగా... ఇందుకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం వరకు చర్చలు రాలేదు. హోల్సిమ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధులు ఈ విషయమై స్పందించేందుకు నిరాకరించారు. హోల్సిమ్ ఇటీవల నాన్-కోర్ ఆస్తులను విక్రయిస్తోంది. సెప్టెంబరులో దాని బ్రెజిలియన్ యూనిట్‌ను $1 బిలియన్‌కు మళ్లించడంతోపాటు జింబాబ్వేలో తన వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్లాన్ చేస్తోంది. కాగా... 1983 లో స్థాపితమైన అంబుజా 31 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉండడంతోపాటు భారత్‌లో ఆరు ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను, ఎనిమిది సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లను కలిగి ఉంది. అదానీ గ్రూప్ ప్రధాన సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రెండు సిమెంట్ అనుబంధ సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అదానీ సిమెంటేషన్ లిమిటెడ్ గుజరాత్‌లో ఓ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీని నిర్మించాలని యోచిస్తోంది, అదానీ గ్రూప్ జూన్ 2021 లో అదానీ సిమెంట్ లిమిటెడ్‌ని స్థాపించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-26T19:46:37+05:30 IST