Abn logo
Nov 24 2021 @ 00:00AM

అదానీ... నబర్ వన్...

ముంబై : ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతం అదానీ  అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ స్థానంలో... అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతం అదానీ... ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆరేళ్ళుగా(2015 నుంచి) ప్ర‌తి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ప్ర‌థ‌మ‌స్థానంలో ఉన్న అంబానీ రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఏప్రిల్ 2020 నుండి అదానీ నికర విలువ బాగా పెరిగింది. కేవలం 20 నెలల్లో గౌతమ్ అదానీ సంపద 1808 శాతం పెరిగింది. ఆయన 83.89 బిలియన్ డాలర్లకు పైగా సంపదను  పెంచుకున్నారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ నికర విలువ 250 శాతం(54.7 బిలియన్ డాలర్లు) మాత్రమే పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో అదానీ సంపద ప్రస్తుత నికర విలువ 88.8 బిలియన్ డాలర్లు. 


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితా ప్రకారం... మంగళవారం నాటికి  అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు. మరోవైపు అంబానీ నికర సంపద 91 బిలియన్ డాలర్లు. అయితే... బుధవారంతో ఈ స్థానాలు మారిపోయాయి. ఆరామ్‌కోతో డీల్‌ బ్రేక్‌ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.77% పడిపోయాయి. మరోవైపు... అదానీ షేర్లు 2.34% జంప్ చేయడంతో, ఆయన సంపద పెరిగాయి. అంబానీ ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. ఆరామ్‌కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు క్షీణిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో... అదానీ పైచేయి సాధించారు.