లక్ష దాటేసిన యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-26T08:05:41+05:30 IST

కరోనా వైరస్‌ ఒక్కసారిగా విరుచుకుపడడంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు లక్ష మార్కుని దాటేశాయి. కేవలం 28 రోజుల వ్యవధిలోనే లక్ష మంది వైరస్‌ బారినపడ్డారు. గత నెల 28న

లక్ష దాటేసిన యాక్టివ్‌ కేసులు

28 రోజుల్లోనే లక్ష మందికి కరోనా

రాష్ట్రంలో 1,01,396 మంది బాధితులు

కొత్తగా 13,819 కేసులు.. 12 మరణాలు

దేశంలో తగ్గిన కేసులు.. కొత్తగా 2.55 లక్షలు


అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఒక్కసారిగా విరుచుకుపడడంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు లక్ష మార్కుని దాటేశాయి. కేవలం 28 రోజుల వ్యవధిలోనే లక్ష మంది వైరస్‌ బారినపడ్డారు. గత నెల 28న రాష్ట్రంలో 1,049 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. మంగళవారం నాటికి ఆ సంఖ్య 1,01,396కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,929 శాంపిల్స్‌ను పరీక్షించగా 13,819 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 22,08,955కి చేరుకుంది. వారిలో 20,92,998 మంది కోలుకున్నారు. మంగళవారం మరో 5,716 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో 12 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 14,561కి పెరిగింది. కాగా.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో 14 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2022-01-26T08:05:41+05:30 IST