ఏ చర్యలు తీసుకున్నారు?

ABN , First Publish Date - 2021-06-17T09:28:56+05:30 IST

సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో బాలల హక్కుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది.

ఏ చర్యలు తీసుకున్నారు?

బాలల హక్కుల పరిరక్షణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం 

సీఎస్‌, డీజీపీ తదితరులకు నోటీసులు 


అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో బాలల హక్కుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది. పిల్లల హక్కుల పరిరక్షణ, చిన్నపిల్లలకు స్నేహపూర్వక న్యాయస్థానాలు ఏర్పాటు, జువైనల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల అమలు కోసం హైకోర్టు సుమోటోగా పిల్‌ నమోదు చేసింది. బచపన్‌ బచావో ఆందోళన్‌ సంస్థ మరో పిల్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

Updated Date - 2021-06-17T09:28:56+05:30 IST