జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-07T09:49:49+05:30 IST

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (యూఎ్‌సఎ్‌ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలి

యూఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (యూఎ్‌సఎ్‌ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మాదం తిరుపతి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపు విషయంలో జేఎన్టీయూ అధికారులు నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-07T09:49:49+05:30 IST