అమరావతి: తన పై దాడి చేసిన వైసీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఆయన ఖండించారు. సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారని ఆరోపించారు. వైసీపీ నాయకులు మాపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసి కొట్టారని చెప్పారు. జగన్ సర్కార్ దౌర్యన్యానికి ఇది పరాకాష్ఠ అని ధ్వజమేత్తారు. పోలీసులు వైసీపీ నేతలకే వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు.