జగిత్యాల: ప్రఖ్యాత కొండగట్టు దేవాలయంలో రేపటి నుంచి 29 వరకు దేవాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు దేవాలయ అధికారులు ప్రకటించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కొండగట్టులో భక్తులకు ఆంక్షలను విధించారు. కరోనా దృష్ట్యా దేవస్థానంలో హనుమాన్ మాల విరమణ చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. చిన్న హనుమాన్ జయంతి వేడుకలను అంతరంగికంగానే చేయాలని దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.