నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్, రెవిన్యూ విభాగాల్లో అక్రమాలపై ఏసీబీ విస్తృత తనిఖీలు, విచారణ చేపట్టింది. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాలాజీ నగర్ కాంతమ్మ ఆశ్రమం సచివాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు.