సండ్ర, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు పూర్తి

ABN , First Publish Date - 2020-10-29T01:45:01+05:30 IST

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి

సండ్ర, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు పూర్తి

హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. సండ్ర, ఉదయ్ సింహ డిశ్చార్జ్‌ పిటిషన్లపై తీర్పు నవంబరు 2కి కోర్టు వాయిదా వేసింది. మంగళవారం కూడా ఓటుకు నోటు కేసులో సండ్ర, ఉదయ్‌సింహలపై మోపిన అభియోగాలకు సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు.. ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో తమ పేర్లను తొలగించాలంటూ సండ్ర, ఉదయ్‌ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై మంగళవారం విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమ ప్రమేయం లేదంటూ నిందితులు చేసిన వాదనను దర్యాప్తు అధికారులు తోసిపుచ్చారు. నిందితుల ఆడియో, వీడియోలు స్పష్టంగా ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి డిశ్చార్జ్ పిటిషన్‌ వేశారని ఏసీబీ తెలిపింది. 


Updated Date - 2020-10-29T01:45:01+05:30 IST