Abn logo

కొబ్బరి సద్ది

కావలసినవి
 
బియ్యం - 100 గ్రాములు, పచ్చి కొబ్బరి పొడి - 100 గ్రాములు, ఎండుమిర్చి - 3, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగప్పప్పు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, పల్లీలు - 50 గ్రాములు, కరివేపాకు - రెండు టీస్పూన్లు, నూనె - ఐదు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్లెంలో వేసి తగినంత ఉప్పు కలిపి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి పల్లీలు వేసి కాస్త వేగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేపి, కొబ్బరి పొడి మరి కాసేపు వేగించాలి. పోపు, కొబ్బరి దోరగా వేగేలా చూసుకోవాలి. ఈ పోపునంతా అన్నంలో వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.

జీడిపప్పు పులావ్‌దద్దోజనంస్వీట్‌కార్న్‌ పలావ్‌ క్యారెట్ రైస్పనసకాయ బిర్యానివాంగీబాత్‌సాబూదానా కిచిడీబిసిబేళ బాత్‌కొర్రల వెజిటబుల్‌ బిర్యానినిమ్మ సద్ది
Advertisement
d_article_rhs_ad_1
Advertisement