Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్

కేప్‌టౌన్: సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డిలియర్స్ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ‘ప్రతిభ ఎళ్లవేళలా ఉండదని’ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ‘మిస్టర్ 360’ తాజా నిర్ణయంతో ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా ముగింపు పలికినట్టు అయింది. 


ఆడాలన్న కసి తనలో తగ్గిపోవడమే తన తాజా ప్రకటనకు కారణమని డిలియర్స్ చెప్పుకొచ్చాడు. తన కెరియర్ ఒక అపూర్వమైన ప్రస్థానమని, క్రికెట్ ఆడిన ప్రతి దశలోనూ ఆటను ఆస్వాదించానని అన్నాడు. 37 ఏళ్ల వయసులో క్రికెట్‌ నుంచి తప్పుకోక తప్పడం లేదన్నాడు. ‘‘అది దక్షిణాఫ్రికా కానీ, ఆర్సీబీ కానీ లేదంటే టైటాన్స్ కానివ్వండి.. క్రికెట్ తనకు ఊహించనంత అనుభవాన్ని, అవకాశాలను కల్పించింది. దీనిని నేను సదా రుణపడి ఉంటాను’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. 


ఐపీఎల్‌‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్ మొత్తం 156 మ్యాచుల్లో 4,491 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత ఇదే అత్యధికం. ఆర్సీబీకి ఆడడానికి ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు డివిలియర్స్ ప్రాతినిధ్యం వహించాడు.


ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్.. 5,162 పరుగులు చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2015లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 133 పరుగులు చేశాడు. 


అలాగే, 114 టెస్టులు ఆడి  50.66 సగటుతో 8,765 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 25 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలతో 9,577 పరుగులు చేశాడు. 78 టీ20ల్లో 1,672 పరుగులు చేశాడు. కాగా, డివిలియర్స్ తాజా నిర్ణయంతో ఆర్సీబీతో అతడి బంధానికి తెరపడనుంది.

Advertisement
Advertisement