Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆవకాయ

ఆవకాయ

కావలసినవి: చిన్నరసాల మామిడికాయలు - 12, జల్లించిన ఆవపిండి - ముప్పావు కప్పు, దంచిన రాళ్ల ఉప్పు - ఒక కప్పు, కారం - ఒక కప్పు, మెంతులు - ఒక టీస్పూన్‌, నువ్వుల నూనె - రెండు కప్పులు, ఇంగువ - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. టెంక, తెల్లటి పొర తీసేయాలి. కొలత కోసం ఒక గ్లాసు తీసుకుని ఉప్పు, కారం, ఆవపిండిని ఒక పాత్రలో వేసి బాగా కలుపుకొని పసుపు, ఇంగువ, మెంతులు కూడా జోడించి కలిపి పెట్టుకోవాలి. మరొక పాత్రలో నూనె పోసి మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేస్తూ మరో పాత్రలోకి తీసుకోవాలి. తరువాత వాటిని కారం, ఆవపిండి కలిపి పెట్టుకున్న పాత్రలో వేసి కలుపుకోవాలి. రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.మూడో రోజు మూత తీసి మరికొద్దిగా నూనె కలిపి సీసాల్లో నింపుకోవాలి. అంతే... ఘుమఘుమలాగే ఆవకాయ రెడీ.


మెంతికాయమెంతికాయపచ్చ ఆవకాయపచ్చ ఆవకాయతొక్కుడు ఊరగాయతొక్కుడు ఊరగాయమాగాయమాగాయమామిడికాయ పచ్చడిమామిడికాయ పచ్చడికొత్తిమీర చట్నీకొత్తిమీర చట్నీక్యారెట్‌ పచ్చడిక్యారెట్‌ పచ్చడిపుదీనా పెరుగు చట్నీపుదీనా పెరుగు చట్నీకొత్తిమీర చట్నీకొత్తిమీర చట్నీఖట్టా మీఠా చట్నీఖట్టా మీఠా చట్నీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.