సీఎం జగన్‌కు బ్రాహ్మణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఘాటు లేఖ

ABN , First Publish Date - 2020-08-08T22:51:48+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రేయ బాబు ఘాటు లేఖ రాశారు.

సీఎం జగన్‌కు బ్రాహ్మణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఘాటు లేఖ

తిరుమల : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రేయ బాబు ఘాటు లేఖ రాశారు. కరోనా వైరస్ రోజు రోజుకీ ఉదృతమవుతోందని.. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం వల్ల అర్చకులు, వేదపండితులు కరోనా బారిన పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరోనాతో తిరుమలలో అర్చకుడు మృతి చెందడం అమంగళకరమన్నారు.


దర్శనాలు నిలిపివేయాలి..

మునుపెన్నడూ లేని రీతిలో తిరుమల అప్రతిష్ట పాలుకావడం శోచనీయం. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆలయాల్లో దర్శనాలు నిలిపివేయాలి. ఆర్థిక భారం పేరుతో భక్తులను దర్శనానికి అనుమతించడం సమంజసం కాదు. కరోనాతో మృతి చెందిన అర్చకుడికి వెంటనే 10లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి. అర్చకుడి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలి. కరోనా అదుపులోకి వచ్చే వరకు నిరవధికంగా ఆలయాలను మూసివేయాలి. దేవాదాయ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో కరోనా బారిన పడిన అర్చకులకు మెరుగైన వైద్యం అందించాలిఅని లేఖ రూపంలో ఆత్రేయ బాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-08T22:51:48+05:30 IST