అసలైన సంపద

ABN , First Publish Date - 2020-09-04T05:30:00+05:30 IST

ఏది చేసైనా సరే... ఇంకా ఇంకా సంపాదించాలనే ఆత్రుత, సంపాదించిన దాన్ని దాచేసుకోవాలనే తాపత్రయం... లోకంలో ఇన్ని అవలక్షణాలు పెరిగిపోవడానికి కారణం ఈ స్వార్థమే! అయితే మానవ జన్మకు సార్థకత కలిగించేది భౌతికమైన సంపద కాదు. దాచుకోవాల్సింది ఎన్నటికీ చెక్కుచెదరని సంపదను...

అసలైన సంపద

ఏది చేసైనా సరే... ఇంకా ఇంకా సంపాదించాలనే ఆత్రుత, సంపాదించిన దాన్ని దాచేసుకోవాలనే తాపత్రయం... లోకంలో ఇన్ని అవలక్షణాలు పెరిగిపోవడానికి కారణం ఈ స్వార్థమే! అయితే మానవ జన్మకు సార్థకత కలిగించేది భౌతికమైన సంపద కాదు. దాచుకోవాల్సింది ఎన్నటికీ చెక్కుచెదరని సంపదను.


‘‘మీ కోసం భూమి మీద సంపదలను కూడబెట్టుకోకండి. వాటిని చిమ్మటలూ, పురుగులూ తినేస్తాయి. లేదా దొంగలు చొరబడి, కన్నం వేసి, దోచుకుంటారు’’ అని హెచ్చరించాడు ఏసుప్రభువు  మరి ఏది అసలైన సంపద? ఆ సంపదను ఎక్కడ దాచుకోవాలి? ‘‘మీ కోసం సంపదలను స్వర్గంలో కూడబెట్టుకోండి. వాటిని చెదలు ఏమీ చెయ్యలేవు. దొంగలు పడి దోచుకోలేరు’’ అని మార్గ నిర్దేశం చేశాడు ఏసు. ‘‘మీ సంపద ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది’’ అని (మత్తయి సువార్త 6:19-21) స్పష్టం చేశాడు. సంపదను ఇహలోకంలో కూకుండా స్వర్గంలో కూడబెట్టుకుంటే హృదయం కూడా స్వర్గంలోనే ఉంటుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలన్న ఆందోళన ఉండదు. అప్పుడు జీవితం స్వర్గం అవుతుంది.  


Updated Date - 2020-09-04T05:30:00+05:30 IST