నిద్రలో తల్లిదండ్రులు.. 9ఏళ్ల చిన్నారి చేసింది చూసి బిత్తరపోయిన పోలీసులు!

ABN , First Publish Date - 2021-06-04T23:43:05+05:30 IST

తొమ్మిదేళ్ల బాలిక తన తల్లిదండ్రులతోపాటు పోలీసులకు షాకిచ్చింది. తల్లింద్రులు నిద్రలో ఉండగా.. 4ఏళ్ల తన చెల్లితో ఆ చిన్నారి చేసిన పని చూసి పోలీసులు బిత్తరపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన

నిద్రలో తల్లిదండ్రులు.. 9ఏళ్ల చిన్నారి చేసింది చూసి బిత్తరపోయిన పోలీసులు!

వాషింగ్టన్: తొమ్మిదేళ్ల బాలిక తన తల్లిదండ్రులతోపాటు పోలీసులకు షాకిచ్చింది. తల్లింద్రులు నిద్రలో ఉండగా.. 4ఏళ్ల తన చెల్లితో ఆ చిన్నారి చేసిన పని చూసి పోలీసులు బిత్తరపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరల్లోకి వెళితే.. కరోనా నిబంధనల వల్ల ఇంట్లో ఉండటాన్ని కాలిఫోర్నియాకు చెందిన 9ఏళ్ల చిన్నారి బోర్‌గా ఫీల్ అయిందో ఏమో. తల్లిదండ్రులు నిద్రలో ఉన్న సమయంలో 4ఏళ్ల తన చెల్లితో కలిసి బీచ్‌లో డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసేందుకు కారులో బయల్దేరింది. తనతోపాటు తన చెల్లికి కూడా సీటుబెల్ట్ పెట్టి.. కారును డ్రైవ్ చేసుకుంటూ ఏకంగా 9 మైళ్ల దూరం వచ్చేసింది. ఈ క్రమంలో ఓ చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. వారి కారు చిన్నపాటి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కారులో ఉన్న చిన్నారులను చూసి కంగుతిన్నారు. 9ఏళ్ల అమ్మాయి కారును డ్రైవ్ చేసినట్టు తెలుసుకుని పోలీసులు  బిత్తరపోయారు. వెంటనే విషయాన్ని ఆ చిన్నారుల తల్లిండ్రులకు చేరవేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు చెప్పింది విని.. ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. కాగా.. ప్రమాద ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 




Updated Date - 2021-06-04T23:43:05+05:30 IST