రాష్ట్రంలో కొత్తగా 793 కేసులు

ABN , First Publish Date - 2020-06-30T08:12:12+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్‌ను పరీక్షించగా..

రాష్ట్రంలో కొత్తగా 793 కేసులు

  • 13,891కి చేరిన పాజిటివ్‌లు..
  • ఒకేరోజు 11 మంది మృతి
  • 20 మంది ఆర్టీసీ కార్మికులకు కరోనా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 793 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వారిలో 706 మంది స్థా నికులు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది, విదేశాల నుంచి వచ్చినవా రు ఆరుగురు ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,891కి చే రుకుంది. తాజాగా పశ్చిమగోదావరిలో అత్యధికంగా 113, గుంటూరులో 98, అనంతపురంలో 96, కర్నూలు 86, కడపలో 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 302 మంది కరోనా నుంచి కో లుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6232కు చేరింది. మరోవైపు సోమవారం ఒక్కరోజే 11 మరణాలు నమోదయ్యాయి. కర్నూలులో ఐదుగు రు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 180కి చేరింది.


పశ్చిమ గోదావరిపై పంజా

పశ్చిమగోదావరి జిల్లాలో 113 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇవిగాక సాయంత్రానికి మరో 11 మందికి పాజిటివ్‌ గా తేలింది. వీటిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏలూరు నగరంలో సీఐ, అతని కుమారుడుకి కూడా పాజిటివ్‌ నిర్ధార ణ అయింది. గుంటూరు జిల్లాలో 98 కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో కొత్త గా 96 కేసులు వెలుగుచూశాయి. దీంతో జి ల్లాలో బాధితుల సంఖ్య 1467కు చేరింది. క డప జిల్లాలో 71 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కడప(26), ప్రొద్దుటూరు(15)లో ఎక్కువ కేసులు బయటపడ్డా యి. కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో జిల్లాలో కరోనా మరణాలు 60కి చేరుకున్నాయి. 24 గంటల్లో జి ల్లాలో 52 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. శ్రీకాకుళంలో ట్రూనాట్‌ పరీక్షల్లో 41 పాజిటివ్‌ అనుమానిత కేసులు బయటపడ్డాయి. 


కర్నూలులో ఐదు మరణాలు

కర్నూలు జిల్లాలో కరోనా మరో ఐదుగురిని బలితీసుకుంది. దీంతో కరోనా మరణాల సంఖ్య 63కు చేరింది. తూర్పుగోదావరి జిల్లా లో 63 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వా టిలో కాకినాడ నగరంలోనే 30 ఉన్నాయి. రెం డు రోజుల వ్యవధిలో ఇక్కడ 70 కేసులు ని ర్ధారించారు. చిత్తూరు మరో 56 మందికి, వి శాఖలో 11 మందికి, నెల్లూరులో 24 మంది కి, ప్రకాశంలో 26 మందికి వైరస్‌ సోకింది.  


కరోనా భయంతో ఆత్మహత్య

కరోనా భయంతో ఓ వ్యక్తి గొంతు కోసుకు ని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమరావతి ప్రాంతం తుళ్లూరులో సోమవా రం చోటుచేసుకుంది. షేక్‌ జానీ(60) అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల తుళ్లూరులో 2 కరోనా కే సులు నమోదయ్యాయి. దీంతో ఆయన కరో నా భయంతో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. 


కరోనా పరీక్ష ల్యాబ్‌లుగా 53 బస్సులు 

ఇప్పటి వరకు 20 మంది ఆర్టీసీ కార్మికులకు కరోనా సోకినట్టు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ చెప్పారు. జగ్గయ్యపేటలో రూ.50 లక్షలతో నిర్మించనున్న ఆర్టీసీ హైవే బస్టాండ్‌ స్థలాన్ని పరిశీలించేందుకు ఆయన సోమవారం జగ్గయ్యపేట విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. 53 ఏసీ బస్సులను కరోనా పరీక్షా కేంద్రాలుగా మారుస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-06-30T08:12:12+05:30 IST