ఈయూలో 70శాతం పెద్దవాళ్లకు కనీసం ఒక డోసు వ్యాక్సిన్: చీఫ్

ABN , First Publish Date - 2021-07-28T08:34:58+05:30 IST

యూరోపియన్ యూనియన్‌లో ఉన్న దేశాల్లోని ప్రజల్లో 70శాతం పెద్దవారు కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌ డెర్ లేయెన్ తెలిపారు.

ఈయూలో 70శాతం పెద్దవాళ్లకు కనీసం ఒక డోసు వ్యాక్సిన్: చీఫ్

బెర్లిన్: యూరోపియన్ యూనియన్‌లో ఉన్న దేశాల్లోని ప్రజల్లో 70శాతం పెద్దవారు కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌ డెర్ లేయెన్ తెలిపారు. దీంతో తాము అనుకున్న లక్ష్యం చేరుకున్నామని ఆమె తెలిపారు. మొత్తం 27 దేశాల్లో ఓవరాల్‌గా 57శాతం మంది ప్రజలు పూర్తి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘ఈ గణాంకాలు యూరప్‌ను ప్రపంచ దిగ్గజాలతో సమానంగా నిలుపుతాయి’’ అని ఉర్సులా అభిప్రాయపడ్డారు. కాగా, యూరప్ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.

Updated Date - 2021-07-28T08:34:58+05:30 IST