తెలంగాణలో కంగారు పెడుతున్న కరోనా మరణాలు.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-04T02:28:29+05:30 IST

తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనాతో...

తెలంగాణలో కంగారు పెడుతున్న కరోనా మరణాలు.. ఇవాళ ఒక్కరోజే..

తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు, ఏడు మరణాలు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 3,020కి చేరింది. ఇవాళ జీహెచ్‌ఎంసీలో 108, రంగారెడ్డి, అసిఫాబాద్‌ 6, సిరిసిల్ల, మేడ్చల్‌ 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఒక్కో కేసు నమోదయినట్లు హెల్త్ బులిటెన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ కొత్తగా ఇద్దరు వలస కూలీలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.


తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌పై కొవిడ్‌-19 పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌ కరోనా కేసుల రాజధానిగా మారిపోతోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలను కట్టడి ప్రాంతాలకే పరిమితం చేసి సడలింపులు ఇస్తుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాలకూ వైరస్‌ విస్తరిస్తోంది. ముఖ్యంగా మే 15 నుంచి ఆంక్షలను సడలించడంతో జనం రాకపోకలు పెరిగాయి.


హైదరాబాద్‌లో మే నెల మొదటి పదిహేను రోజుల్లో 363 కేసులు నమోదైతే.. 16 నుంచి 31వ తేదీ వరకు 652 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే.. 15 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తెలంగాణలో ఒక్క మేలోనే ఇప్పటిదాకా 1660 మందికి పాజిటివ్‌ వచ్చింది. వాస్తవానికి రాష్ట్రంలో మే 31 వరకూ చనిపోయిన 82 మందిలో ఓ 20 మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధులేవీ లేకుండా, కేవలం కరోనా వల్ల కన్నుమూశారు.

Updated Date - 2020-06-04T02:28:29+05:30 IST