65 ఏళ్ల నిబంధన వీరికీ వర్తిస్తుందా?

ABN , First Publish Date - 2020-06-07T08:36:07+05:30 IST

భక్తులకు తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా ముప్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే దర్శనాలు అనుమతిస్తారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తగిన

65 ఏళ్ల నిబంధన వీరికీ వర్తిస్తుందా?

  • టీటీడీ పాలకమండలిలో ఐదుగురి వయసు ఆ పైనే


తిరుపతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): భక్తులకు తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా ముప్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే దర్శనాలు అనుమతిస్తారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డైన్‌ 5.0 సూచనలకు అనుగుణంగా వయసు 65 ఏళ్లు పైబడినవారినీ, పదేళ్లలోపు పిల్లలనూ దర్శనాలకు అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. అయితే, ఈ నిబంధన టీటీటీ పాలకమండలికి కూడా వర్తిస్తుందా? వర్తించదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. పాలకమండలిలో ఐదుగురు సభ్యుల వయసు 65కి పైనే ఉంది. పాలకమండలి సమావేశాలకు, దర్శనాలకు వీరిని అనుమతిస్తారా? లేదా? అనే చర్చ నడుస్తోంది. టీటీడీ పాలకమండలి సభ్యుల్లో ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌ వయసు 75, సుధా నారాయణమూర్తి(ఇన్ఫోసి్‌స)కి 70, వెంకట భాస్కరరావుకు 69, టీఆర్‌ఎస్‌ నేత మూరంశెట్టి రాములుకు 68, ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజుకు 66 ఏళ్లు. కాగా, తిరుమల ఆలయంలో అన్నీ తానై వ్యవహరించే డాలర్‌ శేషాద్రి వయసు 71 ఏళ్లు.  ఆయన లాక్‌డౌన్‌లోనూ ప్రతిరోజూ ఆలయంలో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. అలాగే, రిటైరైన తర్వాత గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమితులైన రమణదీక్షితులు(73) కూడా లాక్‌డౌన్‌లో అప్పుడప్పుడూ ఆలయంలోకి వస్తూనే ఉన్నారు. 

Updated Date - 2020-06-07T08:36:07+05:30 IST