64 శాతం బొగ్గు ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-09-01T05:56:19+05:30 IST

64 శాతం బొగ్గు ఉత్పత్తి

64 శాతం బొగ్గు ఉత్పత్తి

కాకతీయఖని, ఆగస్టు 31: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో గత నెల 64 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించామని జీఎం శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. కేటీకే-1 గనికి 31,680 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని యాజమాన్యం నిర్దేశించగా 21,704 టన్నులను సాధించారు. 9,976 టన్నుల వెనుకంజలో ఉంది. కేటీకే-5 గనికి 31,680 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 19,918టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 1,1762 టన్నుల వెనుకంజలో ఉంది. కేటీకే-6 గనికి 1,9200 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇవ్వగా 11,916టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 7284 టన్నుల వెనుకంజలో ఉంది. కేటీకే-8 గనికి 31,680 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇవ్వగా 16,435 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 15,245 టన్నుల వెనుకంజలో ఉంది. ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌-2కు 76,800 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇవ్వగా 73,145 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 3,655 టన్నుల వెనుకంజలో ఉంది. ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌-3కు 76,800 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇవ్వగా 28,897 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 47,903 టన్నుల ఉత్పత్తి సాధనలో వెనుకంజలో ఉంది. మొత్తంగా ఏరియా ఆగస్టు నెలలో 2,67,840 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా 1,72,015  టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 9,5825 టన్నులు వెనుకంజలో ఉంది.  

Updated Date - 2021-09-01T05:56:19+05:30 IST