ఏపీలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు: ఆళ్లనాని

ABN , First Publish Date - 2020-04-03T20:15:12+05:30 IST

ఏపీలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. 1,085 మంది ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారని

ఏపీలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు: ఆళ్లనాని

అమరావతి: ఏపీలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. 1,085 మంది ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారని, 881 మందిని గుర్తించి పరీక్షలు చేశామని, 108 మందికి పాజిటివ్‌గా తేలిందని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కాంటాక్ట్ అయిన వారిలో 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా టెస్టింగ్‌ ల్యాబ్స్‌ని పెంచాలని సీఎం జగన్ చెప్పారని, విశాఖలో మరో ల్యాబ్‌ సోమవారం అందుబాటులోకి వస్తుందని నాని పేర్కొన్నారు. ప్రైవేట్ ల్యాబ్స్‌ని కూడా పరిశీలించాలని సీఎం చెప్పారన్నారు. 


‘‘ఐసోలేషన్‌ సెంటర్లలో కనీస వసతులు ఉండాలి. క్యాంప్‌లో ఉన్న వలస కూలీలకు అక్కడే రేషన్‌ ఇస్తాం. రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రూ.వెయ్యి ఇస్తాం. పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలి. అరటి, టమాటాను కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేశాం’’ అని ఆళ్లనాని తెలిపారు.

Updated Date - 2020-04-03T20:15:12+05:30 IST