5జీ కౌంట్‌డౌన్ షురూ.. ఆగస్టు నుంచే విస్తరణ మొదలు

ABN , First Publish Date - 2022-06-19T02:10:08+05:30 IST

దేశంలో ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నుంచి 5జీ విస్తరణ మొదలై ఏడాది చివరి నాటికి 20-25 నగరాల్లో పూర్తి కానుంది. ఈ మేరకు

5జీ కౌంట్‌డౌన్ షురూ.. ఆగస్టు నుంచే విస్తరణ మొదలు

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నుంచి 5జీ విస్తరణ మొదలై ఏడాది చివరి నాటికి  20-25 నగరాల్లో పూర్తి కానుంది. ఈ మేరకు టెలింకం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విదేశాలతో పోల్చి చూస్తే ప్రస్తుతం దేశంలో డేటా సగటు ధరలు చాలా చవగ్గా ఉన్నట్టు చెప్పారు.  భారతదేశం 4జీ, 5జీ స్టాక్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ నెట్‌వర్క్‌లలో ప్రపంచానికి విశ్వసనీయ వనరుగా దాని స్థానాన్ని పెంపొందించుకోవాలని మంత్రి పేర్కొన్నారు  భారతదేశం అభివృద్ధి చేస్తున్న 4G, 5G ఉత్పత్తులు, సాంకేతికతలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. 


అయాచిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు 5జీలో ఓ ముఖ్యమైన నియంత్రణ కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఎవరైనా కాల్ చేసినప్పుడు కాలర్ కేవైసీ గుర్తింపు పేరు కనిపిస్తుందన్నారు.  ఈ ఏడాది చివరి నాటికి కనీసం 20-25 నగరాలు, పట్టణాలలో 5G విస్తరణ ప్రారంభమవుతుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు. అలాగే, డేటా ధరలు మన దేశంలో ఇప్పటికే చవగ్గా ఉన్నట్టు చెప్పారు.  

Updated Date - 2022-06-19T02:10:08+05:30 IST