Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 3 2021 @ 13:20PM

పెళ్లి వేడుకలో ఐదేళ్ల పాప మిస్సింగ్.. టెన్షన్ పడుతూ అంతా వెతికిన తల్లిదండ్రులు.. ఫంక్షన్‌హాల్‌కు కాస్త దూరంలో పొలాల్లో..

లక్నో: కుటుంబమంతా కలిసి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వస్తే అప్పు పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లలే ముందుగా రెడీ అయి హడావుడి చేస్తుంటారు. అయితే ఇక్కడ కూడా ఓ ఐదేళ్ల పాప ఎంతో హుషారుగా కుటుంబంతో కలిసి పెళ్లికి వెళ్లింది. అప్పటివరకు తల్లిదండ్రుల ముందే ఆడుకున్న పాప సడెన్‌గా మిస్సయింది. దీంతో వారు టెన్షన్ పడుతూ అంతా వెతికారు. అలా చుట్టు పక్కలా వెతుకుతుండగా ఫంక్షన్‌హాల్‌కు కాస్త దూరంలో ఉన్న పొలాల్లో కనిపించిన బాలికను చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే...


ఆగ్రాలో బుధవారం జరిగిన ఓ పెళ్లి వేడుకకు ఆ కుటుంబమంతా కలిసి హాజరైంది. అందులో వారి ఐదేళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లి తర్వాత బరాత్‌కు అక్కడ డీజే ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల వరకు డీజే ముందు డ్యాన్స్ చేసిన ఆ ఐదేళ్ల పాప సడెన్‌‌గా మిస్సయింది. పాప కనిపించట్లేదని కుటుంబసభ్యులు టెన్షన్ పడుతూ ఫంక్షన్‌హాల్ అంతా వెతికారు. అలా రాత్రంతా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురువారం ఉదయం పది గంటలకు బాలిక మృతదేహాన్ని పొలాల్లో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. చెట్ల పొదల్లో ఉన్న బాలిక మృతదేహంపై దుస్తులు కనిపించలేదు. బాలిక తండ్రి తన కూతురిపై ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. అయితే ఫంక్షన్ హాల్‌కు 300కిలో మీటర్ల దూరంలో బాలిక శవం లభించింది. ఎస్‌ఎస్‌పీ సుధీర్ కుమార్ వెంటనే డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించారు. పెళ్లికి వచ్చిన బంధువుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా బాలిక తండ్రి ఓ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఐదుగురు తోబుట్టువుల్లో బాధితురాలు మూడవది. 


Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement