ఈ ఏడాదే 4జీ సేవలు

ABN , First Publish Date - 2022-03-21T08:14:10+05:30 IST

తమ 4జీ సేవలు ఈ ఏడాదే (2022) ప్రారంభమవుతాయని ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎ్‌సఎన్‌ఎల్‌ ...

ఈ ఏడాదే 4జీ సేవలు

ప్రైవేట్‌ 5జీతో భయం లేదు

 బీఎ్‌సఎన్‌ఎల్‌ సీఎండీ పీకే పుర్వార్‌

న్యూఢిల్లీ : తమ 4జీ సేవలు ఈ ఏడాదే (2022) ప్రారంభమవుతాయని ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎ్‌సఎన్‌ఎల్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీ, యంత్రాల సరఫరా కాంట్రాక్టును త్వరలోనే ఖరారు చేస్తామని కంపెనీ సీఎండీ పీకే పుర్వార్‌ చెప్పారు. ప్రైవేట్‌ కంపెనీలు 5జీ సేవలు ప్రారంభించినా.. బీఎ్‌సఎన్‌ఎల్‌కు ఢోకా ఉండకపోవచ్చన్నారు. మెరుగైన 4జీ సేవల ద్వారా ఖాతాదారులను కాపాడుకుంటామన్నారు. ప్రైవేట్‌ కంపెనీలు 5జీ సేవలు ప్రారంభించినా, అందుకు అవసరమైన మొబైల్‌ ఫోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు.

తగ్గనున్న ఆదాయం

గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.17,452 కోట్లు ఉన్న బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆదాయం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.17,000 కోట్లకు మించక పోవచ్చని పుర్వర్‌ చెప్పారు. ప్రభుత్వం ఇంటర్‌ కనెక్షన్‌ చార్జీలు ఎత్తివేయడం ఇందుకు ప్రదాన కారణమన్నారు. నష్టాలు మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నట్లుగానే రూ.7,441 కోట్ల స్థాయిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. వీఆర్‌ఎ్‌సతో బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహణ ఖర్చులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయని ఆయన తెలిపారు.


బీఎ్‌సఎన్‌ఎల్‌లో బీబీఎన్‌ఎల్‌ విలీనం 

మరోవైపు భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌) కంపెనీని బీఎ్‌సఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని ప్రభు త్వం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అధికారికంగా ఈ నెల్లోనే ఈ విషయం ప్రకటిస్తారని సమాచారం. ఇటీవల బీఎ్‌సఎన్‌ఎల్‌ ఉద్యోగులు నిర్వహించిన ఒక సదస్సుల్లో బీఎ్‌సఎన్‌ఎల్‌ సీఎండీ పుర్వర్‌ కూడా ఈ విషయం ఉద్యోగులకు తెలిపినట్టు  సమాచారం.

Updated Date - 2022-03-21T08:14:10+05:30 IST