‘వందే భారత్ మిషన్’లో భాగంగా 45వేల మందిని ఇండియాకు తరలించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-29T20:40:56+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ జూన్ 13 వరకు కొనసాగుతుం

‘వందే భారత్ మిషన్’లో భాగంగా 45వేల మందిని ఇండియాకు తరలించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్ మిషన్’ ప్రక్రియ జూన్ 13 వరకు కొనసాగుతుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న 45వేల మంది భారతీయులను ఇప్పటి వరకు ఇండియాకు తరలించినట్టు ఆయన వివరించారు. ఇప్పటి వరకు ఇండియాకు  తరలించిన 45వేల మందిలో 8,069 మంది వలస కార్మికులు ఉండగా.. 7,656 మంది విద్యార్థులు, 5,107 మంది నిపుణులు ఉన్నారని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 3,08,200 మంది.. ఇండియాకు తిరిగి రావడానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ‘వందే భారత్ మిషన్’ రెండో దశ ముగిసే నాటికి లక్ష మందిని ఇండియాకు తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-29T20:40:56+05:30 IST