తొలిరోజు 45% హాజరు
ABN , First Publish Date - 2021-02-02T08:11:28+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరచుకున్నాయి. 9వ తరగతి ఆపైన విద్యాసంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో సోమవారం ఉన్నత పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు
ప్రభుత్వ బడుల్లో 48శాతం, ప్రైవేటులో 55%
కొన్నిచోట్ల అపరిశుభ్ర మరుగుదొడ్లతో ఇబ్బందులు
హాస్టళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు విముఖం
గురుకులాల్లో 13% హాజరు, కేజీబీవీల్లో 7శాతమే
ఇంటర్‌లో 32%, డిగ్రీలో 30%, ఇంజనీరింగ్ 75%
పిల్లలు ఉత్సాహంగా హాజరయ్యారు
ప్రభుత్వ చర్యలపై తల్లిదండ్రుల సంతృప్తి: సబిత
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించండి
కలెక్టర్లకు విద్యా శాఖ కార్యదర్శి ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరచుకున్నాయి. 9వ తరగతి ఆపైన విద్యాసంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో సోమవారం ఉన్నత పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. ఈ విద్యాసంవత్సరంలో తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. జూనియర్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచిరోజు తరగతులు నిర్వహించాలని నిర్ణయించడంతో.. సోమవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పాఠాలు ప్రారంభమయ్యా యి. మంగళవారం సెకండియర్ విద్యార్థులకు నిర్వహించనున్నారు.
హాస్టల్ వసతి ఉన్న కసూర్బా, గురుకుల పా ఠశాలల్లో విద్యార్థుల హాజరు అతి తక్కువగా నమోదైం ది. హాస్టళ్లకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఇంకా సుమఖంగా లేకపోవడమే దీనికి కారణం అని తెలిసింది. కాగా తొలిరోజు పాఠశాలల్లో 45శాతం పిల్లలు బడికి వచ్చారు. ప్రైవేటు స్కూళ్లలో 55 శాతం, ప్రభుత్వ బడుల్లో 48శాతం హాజరు నమోదైంది. కేజీబీవీల్లో 7 శాతం, గురుకులాల్లో హాజరు 13 శాతం, జూనియర్ కా లేజీల్లో 32శాతం హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సోమవారం ‘‘ఆంధ్రజ్యోతి’’ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. చౌటుప్పల్, సర్వేల్, రామన్నపేటలోని ప్రభుత్వ గురుకుల స్కూల్‌లో 9, 10, ఇంటర్ విద్యార్థులుండగా ఒక్కరూ రాలేదు. మరికొన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. అన్ని విద్యాసంస్థల్లో తొలిరో జు కొవిడ్ నిబంధనలు పాటించా రు. గదికి 20 మంది చొప్పున కూ ర్చోబెట్టారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీటివసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రం గా ఉండటంతో వినియోగించలేకపోయామని విద్యార్థు లు చెప్పారు.
కొన్నిచోట్ల ఉపాధ్యాయులే బయటివాళ్లను పిలిపించి టాయిలెట్లను శుభ్రం చేయించారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి అనుమతిపత్రం తేకపోవడంతో లోపలికి అనుమతించలేదు. అలాగే డిగ్రీ కాలేజీల్లోనూ హాజరు అంతంత మాత్రంగానే కనిపించింది. 30శాతం విద్యార్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్‌లో తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అయ్యాయి. జేఎన్‌టీయూ పరిధిలో దాదాపు 55వేల మంది విద్యార్థులుండగా 75శాతం హాజరయ్యారని రిజిస్ట్రార్ మన్జూర్ హుసేన్ తెలిపారు. జేఎన్‌టీయూ క్యాంపస్ కాలేజీకి 90శాతం మంది వచ్చారని, అన్ని హాస్టళ్లు, క్యాంటీన్లు తెరచుకున్నాయని పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి: సబిత
పాఠశాలల పునః ప్రారంభమైన తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారని విద్యాశాఖమంత్రి సబి తా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆమె రంగారెడ్డి జిల్లాలోని పలు పాఠశాలలు సం దర్శించారు. జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకున్నందున తల్లిదండ్రులు సంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని.. మౌలి క వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. నీటి వసతి, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జిల్లాల కలెక్టర్లను కోరారు.