Abn logo
Nov 30 2020 @ 18:53PM

నిబంధనలు ఉల్లంఘించి.. జైలుపాలయ్యారు..!

న్యూయార్క్: అమెరికాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం కొవిడ్‌ను తేలిగ్గా తీసుకుంటూ.. యథేచ్చగా రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ సిటీలోని ఓ క్లబ్‌లో కొవిడ్ నిబంధనలను అతిక్రమించి చట్టవిరుద్ధంగా పార్టీ చేసుకుంటున్న 400 మంది అమెరికన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా కొంత మంది న్యూయార్క్ సిటీలోని ఓ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 3 గంటలకు అక్కడకు చేరుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకుంటున్న వారితోపాటు దాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. పార్టీలో పాల్గొన్న వారిలో చాలా మంది కనీసం మాస్కులు కూడా ధరించలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 6.79లక్ష ల మంది కొవిడ్ బారినపడగా.. 34,514 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Advertisement
Advertisement
Advertisement