వికారాబాద్‌: తొలిసారి 4 పాజిటివ్ కేసులు.. 144 సెక్షన్

ABN , First Publish Date - 2020-04-05T18:35:27+05:30 IST

వికారాబాద్ జిల్లా: జిల్లాలో తొలిసారిగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వికారాబాద్‌: తొలిసారి 4 పాజిటివ్ కేసులు.. 144 సెక్షన్

వికారాబాద్ జిల్లా: జిల్లాలో తొలిసారిగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా నేపథ్యంలో పరిగి పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలసులు ప్రకటించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు, మున్సిపల్ అధికారుల సూచించారు. కాగా.. పరిగి 01, తాండూరు01, వికారాబాద్ 01, మార్పల్లి 01గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. వీరందరూ ఢిల్లీ మర్కజ్ వెళ్ళి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసులతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. 

Updated Date - 2020-04-05T18:35:27+05:30 IST