ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-19T00:52:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ చాలావరకు తగ్గింది.

ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ చాలావరకు తగ్గింది. మునుపటితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా చాలా వరకు తగ్గాయి. మరీ ముఖ్యంగా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. తాజాగా.. ఏపీలో 3,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7 లక్షల 83 వేల 132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


గడిచిన 24 గంటల్లో 23 మంది మృతి చెందారని.. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,429కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 36,474 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,40,229 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకూ ఏపీలో 70,66,203 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఉభయ గోదావరి జిల్లాల్లో గత వారం రోజులుగా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. ఆ రెండు జిల్లాల్లో కూడా క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి.


జిల్లాల వారిగా మరణాల సంఖ్య..




ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు..

Updated Date - 2020-10-19T00:52:48+05:30 IST