Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీకి 32,844 కోట్లు ఆర్థిక సాయం: నాబార్డ్ చీఫ్

విజయవాడ: ఏపీకి 2021 ఏడాదిలో 32,844 కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కె.జన్వార్ తెలిపారు. నాబార్డు 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నగరంలో నిర్వహించారు. వేడుకలకు  చీఫ్ జనరల్ మేనేజర్‌తో పాటు ముఖ్య అతిధిగా అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌తో దేశంలో చాలామంది నష్టపోయారన్నారు. నాబార్డ్ తరుపున రైతులకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఏపీకి 2021 ఏడాదిలో 32,844 కోట్లు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మూడు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంవోయు కుదుర్చుకున్నామని సుధీర్ తెలిపారు. 

Advertisement
Advertisement