Abn logo
Apr 8 2021 @ 18:20PM

‘పంజాబ్ కింగ్స్’లో బెంచ్ వీరులు వీరే!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపు (శుక్రవారం) ప్రారంభం కానుంది. ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఆయా జట్లన్నీ సమతూకంలో ఉండేలా చూసుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఎదురొడ్డేందుకు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈసారి పేరు మార్చుకుని రంగంలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కూడా గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కప్పునే లక్ష్యంగా పెట్టుకుంది. క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, నికోలస్ పూరన్ వంటి బిగ్ స్టార్స్ జట్టులో ఉన్నప్పటికీ అదృష్టం ఆ జట్టుకు కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో జట్టును బలంగా మార్చేందుకు వ్యూహాలు పన్నింది. ఇందులో భాగంగా కొందరు ఆటగాళ్లను సీజన్‌లో చాలా వరకు, లేదంటే సీజన్ మొత్తానికి బెంచ్‌కే పరిమితం చేయాలని చూస్తోంది. అలాంటి వారిలో దర్శన్ నల్కండే, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ పోరెల్ ఉన్నారు. వీరి ముగ్గురికి తది జట్టులో చోటు కష్టమేనని అంటున్నారు.

దర్శన్ నల్కండే: జట్టులో పెద్దగా ఎవరికీ తెలియని ఆటగాళ్లలో దర్శన్ ఒకడు. విదర్భకు చెందిన యువ ఫాస్ట్ బౌలర్‌కు అనుభవలేమి ఆటంకంగా మారే అవకాశం ఉంది. అండర్ 23 సీకే నాయుడు ట్రోఫీలో ఇరగదీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత విజయ్ హాజరే ట్రోఫీకి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లో బాగానే రాణించాడు. 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. చేజింగ్‌లో అజేయంగా 53 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు కనుక ప్లే ఆఫ్స్‌కు త్వరగా చేరుకుంటే జట్టులో మార్పులు చేసి దర్శన్‌కు చోటివ్వొచ్చు. లేదంటే మీడియం పేస్‌ను బలోపేతం చేయాలని కేఎల్ రాహుల్ కనుక భావించినా దర్శనకు చోటు దక్కవచ్చు. లేదంటే సీజన్ మొత్తం బెంచ్‌కు పరిమితం కాకతప్పదు.  


సర్ఫరాజ్ ఖాన్: గేల్‌కు బదులుగా సర్ఫరాజ్ ఖాన్‌ను రిటైన్ చేసుకోవాలని ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో అతడి పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు గేల్, సర్ఫరాజ్ ఖాన్ ఒకే జట్టులో ఉన్నారు .2014 అండర్ 19 ప్రపంచకప్‌లో ఖాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి రాణించాడు. అయితే, ఆ తర్వాత అతడు తన పై పెట్టుకున్న అంచనాలను నిజం చేయడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా ఖాన్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు 38 ఐపీఎల్ మ్యాచ్‌లు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఖాన్ 441 పరుగులు మాత్రమే చేశాడు.  అయితే, పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా ప్యాక్ అయిపోవడంతో సర్ఫరాజ్‌కు చోటు దక్కే అవకాశం లేదు. కాబట్టి అతడు కూడా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. 


ఇషాన్ పోరెల్: 2018 అండర్ 19 ప్రపంచకప్‌లో ఇషాన్ పోరెల్ చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 17 పరుగులిచ్చి 4 వికెటలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం పంజాబ్ జట్టు మంచి బౌలింగ్ లైనప్‌తో బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం అతడిని కూడా పక్కన బెంచ్‌కు పరిమితం చేయొచ్చని తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement