నల్గొండ : రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి రామాలయం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలలో భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్తో కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.