29 నుంచి మద్యం దుకాణాలకు స్టాక్
ABN , First Publish Date - 2021-11-24T09:11:15+05:30 IST
కొత్త మద్యం దుకాణాలకు ఈ నెల 29 నుంచి స్టాక్‌ను విడుదల చేయాలని అధికారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం దుకాణాలకు ఈ నెల 29 నుంచి స్టాక్‌ను విడుదల చేయాలని అధికారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. కొత్త మద్యం విధానం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మద్యం స్టాక్ విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళ వారం జారీ చేశారు. మద్యం స్టాక్ విడుదల నేపథ్యంలో ఎక్సైజ్‌తో పాటు డిపోల సిబ్బందికి డిసెంబర్ 31 వరకు సెలవులు ఉండవని, అందరూ కచ్చితంగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.ఈ నెల 28, డిసెంబర్ 5, 12వ తేదీలు ఆదివారాలైనా సరే మద్యం డిపోలను తెరిచే ఉంచాలని అహ్మద్ సూచించారు.