రూ. 28,719

ABN , First Publish Date - 2021-07-20T06:42:59+05:30 IST

జూనియర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎ్‌స)కు శుభవార్త. వారి వేతనాలను

రూ. 28,719

  • జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల  వేతనం పెంచిన ప్రభుత్వం
  • ఇకపై ప్రొబేషన్‌  నాలుగేళ్లు
  • జేపీఎస్‌ల వేతనం రూ. 28,719


హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎ్‌స)కు శుభవార్త. వారి వేతనాలను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం నెలకు రూ. 15 వేల గౌరవ వేతనం పొందుతుండగా ఇకనుంచి వారి వేతనం రూ. 28,719 లకు పెంచుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.రఘునందన్‌ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనం జూన్‌  1, 2021 నుంచే అమలులోకి రానున ్నది.


కాగా, వీరి ప్రొబేషనరీ పీరియడ్‌ను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య 12,769కి చేరింది. ఇందుకు అనుగుణంగా 9,355 మంది జేపీఎ్‌సలను దాదాపు రెండేళ్ల క్రితం తాత్కాలిక ప్రాతిపాదికన ప్రభుత్వం నియమించింది. నెలకు రూ. 15 వేల వేతనంతో మూడేళ్లు పని చేయాలని పేర్కొంది. ఆపై పనితీరు ఆధారంగా సర్వీసును క్రమబద్ధీకరిస్తామని తెలిపింది.  



ప్రొబేషన్‌ పీరియడ్‌ పెంపు తగదు: కార్యదర్శులు


జేపీఎ్‌సల వేతనాలను పెంచడాన్ని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, ప్రధాన కార్యర్శి రమేశ్‌తో పాటు జేపీఎ్‌సలు స్వాగతించారు. అయితే, ప్రొబేషనరీ పీరియడ్‌ను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచడం తగదని వారు అన్నారు. మరోవైపు.. జేపీఎ్‌సలకు వేతనం పెంచడం సంతోషకరమని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌, కార్యదర్శి విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-20T06:42:59+05:30 IST